ఎసిడిటీ, కడుపు ఉబ్బరం అనుకొని వదిలేయకండి.. ఈ లక్షణాలు ఉంటే డాక్టర్‌ను కలవాల్సిందే!
- జీవనశైలిలో మార్పుల వల్ల జీర్ణ సమస్యలు
- దీర్ఘకాలం వేధిస్తే అప్రమత్తం కావాలి
- లేదంటే తీవ్రమైన సమస్యలకు దారితీసే ప్రమాదం
- ఇంకేదైనా ప్రమాదకర వ్యాధులకు సంకేతమూ అయ్యుండొచ్చు
- డాక్టర్‌ను తప్పనిసరి కలవాల్సిందే
జీవితంలో ఏదో ఓ దశలో ప్రతిఒక్కరూ జీర్ణ సమస్యలు ఎదుర్కొంటారు. టైమ్‌కు తినకపోవడం, జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం, వ్యాయామం చేయకపోవడం, తగినంత నీరు తాగకపోవడం, ధూమపానం, మద్యపానం, మానసిక ఒత్తిడి వంటి అలవాట్లు సమస్యను మరింత తీవ్రం చేస్తాయి. ఊబకాయం, నిద్రలేమి కారణంగా కూడా యాసిడ్ రిఫ్లక్స్, ఇతర జీర్ణ సమస్యలు పెరుగుతున్నాయి. అయితే ఇవి పదే పదే వేధిస్తుంటే మాత్రం కచ్చితంగా డాక్టర్‌ను సంప్రదించాలి. ఎందుకంటే ఇవి లోపల ఇంకేదైనా పెద్ద సమస్యలకు సంకేతాలు కావచ్చు.
ఈ సమస్యలకు కారణాలు
యాసిడ్ రిఫ్లక్స్ వల్ల ఎసిడిటీ వస్తుంది. అలాగే కడుపు ఉబ్బరం వల్ల పొట్ట ఉబ్బినట్లు, బిగుతుగా ఉన్నట్లు అనిపిస్తుంది. ఎక్కువగా గ్యాస్ చేరడం వల్ల ఈ సమస్య వస్తుంది. మసాలాలు, నూనె పదార్థాలు ఎక్కువగా తినడం, కార్బోనేటెడ్ డ్రింక్స్ తాగడం, అర్ధరాత్రి పూట భోజనం చేయడం వంటి అలవాట్ల వల్ల ఇవి తలెత్తుతాయి.
అయితే అన్ని గ్యాస్ట్రిక్ సమస్యలు కేవలం అజీర్తి వల్లే వస్తాయని అనుకోలేం. గ్యాస్ట్రైటిస్, గ్యాస్ట్రోఈసోఫాగియల్ రిఫ్లక్స్ డిసీజ్, పెప్టిక్ అల్సర్లు, పిత్తాశయ రాళ్లు, ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్, ఫ్యాటీ లివర్, క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధులు కూడా ఆరంభంలో ఇలాంటి సాధారణ లక్షణాలతోనే మొదలవుతాయి. రోజూ యాంటాసిడ్లు అవసరమైతే లేదా తిన్న తర్వాత అసౌకర్యంగా అనిపిస్తూ సమస్య రోజురోజుకూ పెరుగుతుంటే మాత్రం డాక్టర్‌ను వెంటనే కలవాలి.
అలర్ట్ అవ్వాల్సిన సంకేతాలు
ఈ మార్పులు చేసుకోండి
సరైన సమయానికి భోజనం చేయాలి. అతిగా తినొద్దు. అర్ధరాత్రి ఆకలిని కంట్రోల్ చేసుకోవాలి. మసాలాలు ఎక్కువగా ఉండే ఆహారాలు, ప్రాసెస్ చేసిన పదార్థాలు, కూల్ డ్రింక్స్, కాఫీలను తగ్గించుకోవాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. సరిపడా నీళ్లు తాగాలి. పండ్లు, కూరగాయలు ఆహారంలో భాగం చేసుకోవాలి.

- పై సమస్యలు వారంలో చాలాసార్లు రావడం
- కారణం లేకుండా బరువు తగ్గడం, ఆకలి లేకపోవడం
- తీవ్రమైన, దీర్ఘకాలిక నొప్పులు
- నల్లటి లేదా రక్తంతో కూడిన మలం, వాంతులు
- మింగడంలో ఇబ్బంది, విపరీతమైన అలసట